కేఎల్ యూనివర్సిటీలో అగ్నిప్రమాదం
తాడేపల్లి: గుంటూరు జిల్లా తాడేపల్లి మండలంలోని కేఎల్ యూనివర్సిటీలో గురువారం రాత్రి అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. యూనివర్సిటీ ప్రాంగణంలోని లైబ్రరీలో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో భారీగా పొగలు వ్యాపించాయి. మంటల తీవ్రతకు లైబ్రరీలోని పలు సామగ్రి పూర్తిగా దగ్ధమైనట్లు సమాచారం. అగ్నిప్రమాదానికి గల కారణాలు, జరిగిన నష్టం ఎంతమేరకు ఉందనే వివరాలు తెలియాల్సి ఉంది. అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చేందుకు చర్యలు చేపట్టారు.



