← Back to news

నంది అవార్డులకు ఏపీ సర్కార్ గ్రీన్ సిగ్నల్

By Mahesh· 12h ago· AP
నంది అవార్డులకు ఏపీ సర్కార్ గ్రీన్ సిగ్నల్

AP: సినీ, టీవీ రంగాలకు ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. పెండింగ్‌లో ఉన్న నంది అవార్డులతో పాటు 2025 అవార్డులను కూడా కండక్ట్ చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 2012–2016 నంది, జాతీయ ఫిల్మ్ అవార్డుల వేడుకను నవంబర్‌లో విజయవాడలో జరపనున్నారు. జ్యూరీలను సెప్టెంబర్‌లో ఏర్పాటు చేసి, విజేతల లిస్ట్‌ను నవంబర్‌లో అనౌన్స్ చేయనున్నారు. ఫిల్మ్ అవార్డుల వేడుక డిసెంబర్‌లో అమరావతి/విజయవాడలో, టీవీ అవార్డుల వేడుక తిరుపతిలో జరగనున్నట్లు మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు.

More in AP