← Back to news

అప్పుల బాధతో యువకుడి ఆత్మహత్య!

By Bala· 4h ago· TG
అప్పుల బాధతో యువకుడి ఆత్మహత్య!

ములుగు జిల్లా వెంకటాపూర్ మండలంలో విషాదం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు.. నర్సాపూర్‌‌కు చెందిన వేణు (27) అప్పుల బాధతో ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబీకులు పోలీసులకు సమాచారం అందించగా, ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ములుగు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వేణుకు భార్యతో పాటు 9 నెలల కుమారుడు ఉన్నారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

More in TG