తప్పుడు కేసుపై లాఠీచార్జ్..!
AP: గుంటూరు జిల్లా.. తెనాలిలో ముగ్గురు దళిత యువకులపై పెట్టిన కేసును జిల్లా కోర్టు కొట్టివేసింది. 2025 ఏప్రిల్‌లో ఈ ఘటన జరిగింది. జాన్ విక్టర్, రాకేష్, కరీముల్లాలపై గంజాయి మత్తులో కానిస్టేబుల్‌పై దాడి చేశారని ఆరోపిస్తూ పోలీసులు.. వారిని చట్ట విరుద్ధంగా రోడ్డుపై కూర్చోబెట్టి అరికాళ్లపై లాఠీలతో కొట్టారు. అప్పట్లో ఆ వీడియో వైరల్ అయ్యింది. లంచం ఇవ్వలేదనే కారణంతోనే పోలీసులు తమను టార్గెట్ చేశారని యువకులు ఆరోపించారు. ఈ ఘటనపై మీరు ఏమనుకుంటున్నారు. మీ ఒపీనియన్ కామెంట్ చెయ్యండి.



