కహూతా ప్లాన్ అంటే ఏంటి? ఇందిర ఎందుకు వద్దన్నారు?

భారత్ 1974లో అణు పరీక్ష ("స్మైలింగ్ బుద్ధ") చేసిన తర్వాత, పాక్ ప్రధాని జుల్ఫికర్ అలీ భుట్టో "మేము గడ్డి తిని అయినా సరే అణుబాంబు తయారుచేస్తాం" అని ప్రతిజ్ఞ చేశారు. 1980ల నాటికి పాకిస్తాన్ శాస్త్రవేత్త ఏక్యూ ఖాన్ ఆధ్వర్యంలో కహుతాలో న్యూక్లియర్ బాంబ్ తయారీకి దగ్గరగా వచ్చేసింది. దీనిని అడ్డుకోవడానికి ఇజ్రాయెల్, భారత్ కలిసి ఒక ప్లాన్ వేశాయి. గుజరాత్‌లోని జామ్‌నగర్‌కు ఇజ్రాయెల్ యుద్ధ విమానాలువచ్చి, అక్కడ ఫ్కుయల్ నింపుకుని రాడార్లకు చిక్కకుండా కహుతా అణు కేంద్రాన్ని బాంబులతో ధ్వంసం చేయడం ఈ ప్లాన్. అయితే పాక్ ఎదురు దాడికి భయపడి లాస్ట్ మినిట్ లో ఇందిరాగాంధీ వద్దన్నారు.



