రోడ్డుపై ఖాళీ బిందెలు పెట్టి నిరసన
జగిత్యాల జిల్లా ఎండపల్లి మండలం గుల్లకోట SC కాలనీలో తాగునీటి సమస్యతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కొన్ని రోజులుగా మొదటి, రెండో వాడల్లో నీరు సక్రమంగా సరఫరా కావడం లేదని స్థానికులు తెలిపారు. సమస్యను పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. Mission Bhagiratha నీరు అందక తాగేందుకు నీళ్లు లేక ఇబ్బందులు పడుతున్నామని మహిళలు తెలిపారు. సమస్య పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఖాళీ బిందెలతో ధర్నా చేపట్టారు.



