← Back to news

ట్యాంకర్‌తో పొలానికి నీళ్లు

By Mahesh· 2h ago· Nizamabad

ఎల్‌నినో ఎఫెక్ట్‌తో వర్షాలు పడక, బోరు బావుల్లో నీళ్లు అడుగంటిపోవడంతో నిజామాబాద్ జిల్లా భీమ్‌గల్‌లో ఓ రైతు తన పంటని కాపాడుకునేందుకు ట్యాంకర్‌తో నీళ్లు పారించారు. బోర్లు, కుంటలు ఎండిపోవడంతో తన 1.5 ఎకరాల పంట పడిపోయే పరిస్థితి వచ్చిందని ఆవేదన చెందారు. పంట కోతకు ఇంకో 20 రోజులే ఉండటంతో ట్యాంకర్ల ద్వారా వాటర్ అందిస్తూ పంటను కాపాడుకుంటున్నట్లు చెప్పారు.

More in Local