పోలీసులే నిందితులు..మహిళపై గ్యాంగ్‌రేప్

UPలోని అమ్రోహాలో హరియాణాకు చెందిన ఓ మహిళపై గ్యాంగ్ రేప్ జరిగింది. మహిళను అమ్రోహాలోని మతపరమైన ప్రాంతాలను చూపిస్తామని తీసుకొచ్చి, ఆమెను ఫామ్‌హౌస్‌కు తీసుకెళ్లిన ఇద్దరు సీఆర్పీఎఫ్ సిబ్బంది, ఇద్దరు పోలీసులు అత్యాచారం చేశారు. బాధితురాలు ఆన్‌లైన్‌లో పోలీసు హెల్ప్‌లైన్ నంబర్ వెతికి ఫోన్ చేసింది. పోలీసులు అక్కడికి చేరుకుని ఆమెను రక్షించారు. నలుగురు నిందితులను అరెస్టు చేసి కేసు దర్యాప్తు చేస్తున్నారు.


