← Back to news

పెదవడ్లపూడిలో ఘనంగా నవదుర్గ ఉత్సవాలు

By epuri rajaratnam· 4h ago· Mangalagiri Urban, Mangalagiri, Guntur
పెదవడ్లపూడిలో ఘనంగా నవదుర్గ ఉత్సవాలు

గుంటూరు జిల్లా మంగళగిరి మండలం పెదవడ్లపూడి రైల్వే స్టేషన్ సమీపంలో నవదుర్గ ఉత్సవాలు ఘనంగా జరిగాయి. అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వ్యవసాయ మార్కెట్ యార్డు చైర్మన్ జవ్వాది కిరణ్ చంద్ అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించి భక్తులకు అన్నప్రసాదం పంపిణీ చేశారు. గ్రామ ప్రజల సహకారంతో ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని పేర్కొన్నారు.

More in Local