← Back to news

Dr.జయచంద్ర మోహన్ DMHO గారు ఉద్యోగస్తులకు సంఘీభావం

By KP· 2h ago· Narayanpet
Dr.జయచంద్ర మోహన్ DMHO గారు ఉద్యోగస్తులకు సంఘీభావం

నారాయణపేటలో NHM ఉద్యోగుల రిలే దీక్షలు సోమవారంతో 7వ రోజుకు చేరాయి. ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయాలని డిమాండ్ చేస్తూ దీక్షా స్థలం నుంచి గాంధీజీ, అంబేద్కర్ విగ్రహాల వరకు నిరసన ర్యాలీ నిర్వహించారు. అనంతరం ప్రభుత్వానికి తమ డిమాండ్లను తెలియజేస్తూ వినతిపత్రాలు సమర్పించారు. జిల్లా DMHO డాక్టర్ జయచంద్ర మోహన్ ఉద్యోగులకు సంఘీభావం తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉద్యోగ సంఘాల నాయకులు, పలువురు NHM సిబ్బంది పాల్గొని తమ డిమాండ్‌ను ప్రభుత్వం పరిష్కరించాలని కోరారు.

Dr.జయచంద్ర మోహన్ DMHO గారు ఉద్యోగస్తులకు సంఘీభావం
Dr.జయచంద్ర మోహన్ DMHO గారు ఉద్యోగస్తులకు సంఘీభావం

More in Local