హైదరాబాద్‌కు 3 కొత్త లోగోలు.. సిటీకి కొత్త ఐడెంటిటీ!

TG: హైదరాబాద్ సిటీ అడ్మినిస్ట్రేషన్‌లో కీలక మార్పుకు మరో విజిబుల్ మార్క్ వచ్చింది. CM రేవంత్‌రెడ్డి GHMC, సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (CMC), మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ (MMC) కొత్త లోగోలను లాంచ్ చేశారు. నిన్న మూసారంబాగ్ బ్రిడ్జి ప్రారంభానికి ముందు ఈ లోగోలను రిలీజ్ చేశారు. దాదాపు పదేళ్ల తర్వాత GHMCకి కొత్త లోగో వచ్చింది. CMC లోగో కేర్, సస్టైనబిలిటీ, గ్రోత్‌ను, MMC లోగో ఇన్‌క్లూజివ్ డెవలప్‌మెంట్, గుడ్ గవర్నెన్స్, ప్రజా సేవను రిప్రజెంట్ చేసేలా ఈ లోగోలను డిజైన్ చేశారు.



