కుక్క కాటుతో బాలుడి మృతి.. రష్మి గౌతమ్ స్పందన!

AP: పల్నాడు జిల్లాలో రెండేళ్ల సోహాన్ రుద్రాన్ష్ రేబీస్‌తో మృతి చెందడంపై యాంకర్ రష్మి గౌతమ్ ఆవేదన వ్యక్తం చేశారు. కుక్క కరవకపోయినా, దాని లాలాజలం చిన్న గాయానికి తగిలినా రేబీస్ సోకే ప్రమాదం ఉందని చెప్పారు. జంతువు గాయాన్ని నాకినా, గీరినా వెంటనే సబ్బుతో శుభ్రంగా కడిగి, ఆలస్యం చేయకుండా యాంటీ రేబీస్ వ్యాక్సిన్ వేయించుకోవాలని సూచించారు. జంతువులను హింసించడం పరిష్కారం కాదని అన్నారు.


