మంగళగిరిలో ఫేక్ లిక్కర్ ప్రచారంపై క్లారిటీ

AP: మంగళగిరిలో ఫేక్ లిక్కర్ అమ్ముతున్నారంటూ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వార్తలపై ఎక్సైజ్ శాఖ క్లారిటీ ఇచ్చింది. బాటిల్‌ను తప్పుగా స్కాన్ చేయడం వల్లే ‘QR Code Not Found’ ఎర్రర్ వచ్చిందని తెలిపింది. యాప్ ఇన్‌స్టాల్ కోసం ఉన్న QR కోడ్‌ను స్కాన్ చేసి బాటిల్ నకిలీదంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని అధికారులు చెప్పారు. లిక్కర్ అసలుదో కాదో తెలుసుకోవాలంటే క్యాప్‌పై ఉన్న ‘Verification QR Code’ను ‘AP Excise Suraksha’ యాప్‌తో స్కాన్ చేయాలని సజెస్ట్ చేశారు.



