భర్త అఫైర్‌ను మామ ఆపలేదని కేసు

మేజర్ అయిన కొడుకుని కంట్రోల్ చేయలేదనే రీజన్‌తో మామగారిపై గృహ హింస కేస్ పెట్టలేరని ఢిల్లీ హైకోర్ట్ తీర్పు ఇచ్చింది. కొడుకు వేరే మహిళతో రిలేషన్‌లో ఉన్నప్పుడు మామగారు జోక్యం చేసుకోలేదని, అలాగే ఆయనే ఇంట్లోంచి పంపేశారని ఆరోపిస్తూ ఒక మహిళ 2019లో గృహ హింస కేస్ ఫైల్ చేసింది. దీనిపై విచారణ జరిపిన జస్టిస్ మధు జైన్, కొడుకు వ్యవహారాల్లో తండ్రి జోక్యం చేసుకోకపోవడం గృహహింస కిందకు రాదని స్పష్టం చేశారు. సరైన ఆధారాలు లేకుండా మామపై పెట్టిన ఈ కేస్‌ను కోర్టు డిస్మిస్ చేసింది.



