← Back to news

ఒక్కో రైతు కుటుంబానికి రూ.50 వేలు ఇవ్వాలి: అజయ్‌కుమార్

By DK· 13h ago
ఒక్కో రైతు కుటుంబానికి రూ.50 వేలు ఇవ్వాలి: అజయ్‌కుమార్

వర్షాలు లేక పంటలు ఎండిపోతున్న నేపథ్యంలో రాష్ట్రాన్ని ప్రకృతి విపత్తు ప్రాంతంగా ప్రకటించి రైతులను ఆదుకోవాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు జంగాల అజయ్‌కుమార్ డిమాండ్ చేశారు. పంటలు నష్టపోయిన ప్రతి రైతు కుటుంబానికి రూ.50 వేల చొప్పున పరిహారం అందించాలని కోరారు. మంగళవారం గుంటూరు కొత్తపేటలోని మల్లయ్యలింగం భవన్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. పెట్టుబడులు పెట్టి సాగు చేసిన తర్వాత వర్షాలు లేక పంటలు ఎండిపోవడంతో రైతులు అప్పుల పాలవుతున్నారని అన్నారు.

More in AP