సెప్టెంబర్ 17ను అధికారికంగా నిర్వహించాలి: బీజేపీ

తెలంగాణ విమోచన దినోత్సవాన్ని సెప్టెంబర్ 17న రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని బీజేపీ రాష్ట్ర కార్యదర్శి మాదగాని శ్రీనివాస్ గౌడ్ డిమాండ్ చేశారు. నల్లగొండ జిల్లా బీజేపీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలంగాణ విమోచన చరిత్రను భావితరాలకు తెలియజేసేందుకు సెప్టెంబర్ 17ను అధికారికంగా నిర్వహించడంతోపాటు చరిత్రను పాఠ్యాంశాల్లో చేర్చాలని కోరారు. కర్ణాటక, మహారాష్ట్రలో అధికారికంగా నిర్వహిస్తున్నప్పటికీ తెలంగాణలో ఎందుకు నిర్వహించడం లేదని ప్రశ్నించారు.


