YSRCP రాష్ట్ర కార్యాలయంలో వినాయక చవితి

వినాయక చవితి సందర్భంగా గుంటూరు జిల్లా తాడేపల్లిలోని YSRCP రాష్ట్ర కార్యాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి, మంగళగిరి నియోజకవర్గ సమన్వయకర్త దొంతిరెడ్డి వేమారెడ్డి విఘ్నేశ్వరుడికి పూజలు చేసి హారతి సమర్పించారు. పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలు సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని, విఘ్నేశ్వరుడి ఆశీస్సులు అందరిపై ఉండాలని నాయకులు ఆకాంక్షించారు.



