నిరసనను నిరోధించేందుకే ఢిల్లీ మూసివేత: అభిజీత్ దీప్కే

శాంతియుత నిరసనను నిరోధించేందుకే నరేంద్ర మోదీ ప్రభుత్వం ఢిల్లీని మూసివేసిందని సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీనిపై CJP ఫౌండర్ అభిజీత్ దిప్కే రియాక్ట్ అయ్యారు. జాతీయ రాజధానిలో శాంతియుతంగా నిరసన తెలిపేందుకు అనుమతి ఇవ్వకుండా, ప్రభుత్వం ఏకంగా నగరాన్ని మూసివేసిందని ఆరోపించారు. ఈ నిర్ణయం వల్ల లక్షలాది మంది ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, వారి దైనందిన జీవితాలపై ఇది ప్రతికూల ప్రభావం చూపుతోందని తన ఎక్స్ అకౌంట్‌లో పోస్ట్ చేశారు.


