← Back to news

కొడంగల్‌లో సీఎం రేవంత్ పర్యటన

By Mahesh· 20 Jul 2026· TG
కొడంగల్‌లో సీఎం రేవంత్ పర్యటన

TG: సీఎం రేవంత్ రెడ్డి రేపటి నుంచి రెండు రోజుల పాటు వికారాబాద్ జిల్లా కొడంగల్ నియోజకవర్గంలో పర్యటించనున్నారు. దుద్యాల్ మండలం హకీంపేటలో ఎడ్యుకేషన్ హబ్ పనులను పరిశీలిస్తారు. తరువాత ఉన్నతస్థాయి సమావేశంలో సమీక్షిస్తారు. రాత్రి కొడంగల్‌లో బస చేసి మరుసటి రోజు (22న) నియోజకవర్గంలో చేపట్టిన అభివృద్ధి పనులను సమీక్షించనున్నారు. SIR కొనసాగుతున్న తీరును ముఖ్యమంత్రి పరిశీలిస్తారు. మధ్యాహ్నం తిరిగి హైదరాబాద్‌కు బయలుదేరుతారు.

More in Politics