← Back to news

ఆయుధాల చోరీ ఎలా చేశారు? అక్కడే.!

By Prashanth Yadav· 6h ago
ఆయుధాల చోరీ ఎలా చేశారు? అక్కడే.!

హైదరాబాద్‌లోని బొల్లారం మిలిటరీ కంపౌండ్‌ నుంచి ఆయుధాలు చోరీ అయిన కేసులో పోలీసులు ఓ మాజీ ఆర్మీ అధికారిని అదుపులోకి తీసుకున్నారు. ఆయన గతంలో మద్రాస్ రెజిమెంట్‌లో పనిచేశారు. చెడు వ్యసనాల కారణంగా ఈ చోరీ చేశారని తెలిసింది. మరో ముగ్గురు అధికారులు సహకరించినట్లు గుర్తించి వారిని కూడా అరెస్టు చేశారు. నిందితుడి ఇంట్లో 12 AK-47 తుపాకులు, ఇన్‌సాస్ గన్స్‌తో పాటు దాదాపు 1,200 రౌండ్ల బుల్లెట్లు స్వాధీనం చేసుకున్నారు. పటిష్ట భద్రత ఉన్న కంపౌండ్‌ నుంచి ఎలా చోరీ చేశారనే విషయంపై విచారణ కొనసాగుతోంది.

More in TG

కులాంతర పెళ్లి చేసుకుందని ఇల్లు కూల్చివేత.. పోలీసులు?
TG· 6h ago

కులాంతర పెళ్లి చేసుకుందని ఇల్లు కూల్చివేత.. పోలీసులు?

TG: గద్వాల జిల్లాలో దారుణ ఘటన జరిగింది. రేపల్లి గ్రామానికి చెందిన మహేశ్వరి, రంగముని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. తాను ఇష్టపూర్వకంగానే పెళ్లి చేసుకున్నానని, తల్లిదండ్రులతో వెళ్లేది లేదని మహేశ్వరి పోలీసులకు చెప్పింది. దీంతో పోలీసులు ఆమె కుటుంబ సభ్యులకు కౌన్సెలింగ్ ఇచ్చారు. అయితే కులాంతర వివాహంపై కోపంతో యువతి కుటుంబ సభ్యులు ట్రాక్టర్లు, గడ్డపారలతో రంగముని ఇంటిని కూల్చేశారు. <a href="https://www.theclearcutnews.com/n/s7Lc8Cr">బాధితుల ఫిర్యాదుతో</a> పోలీసులు గ్రామంలో సెక్యూరిటీ పెట్టారు. ఘటన తర్వాత ఆ ముగ్గురు పోలీసుల ఎదుట లొంగిపోయినట్లు తెలుస్తోంది.