నూతక్కిలో డెవలప్‌మెంట్ వర్క్స్

మంత్రి నారా లోకేష్ చొరవతో మంగళగిరి నియోజకవర్గంలోని నూతక్కి గ్రామంలో 1.43 కోట్ల రూపాయిలతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. రోడ్లు, డ్రెయిన్లు, కల్వర్టులు, డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీస్ కోసం ఈ నిధులు కేటాయించారు. గ్రామాభివృద్ధికి తమ ప్రభుత్వం ఫుల్ ప్రయారిటీ ఇస్తోందని TDP లీడర్ పోతినేని శ్రీనివాసరావు తెలిపారు. ఈ ప్రోగ్రామ్‌లో పలువురు కూటమి నాయకులు, స్థానికులు పాల్గొన్నారు.



