భారత్–అమెరికా సైనిక విన్యాసాల్లో M777 ఫైరింగ్!
భారత్, అమెరికా సైనికులు కలిసి ‘యుద్ధ్ అభ్యాస్’ చేస్తున్నారు. రాజస్థాన్‌లోని మహాజన్ ఫైరింగ్ రేంజ్‌లో భారత సైనికులు M777 అనే పెద్ద ఆర్టిలరీ గన్స్‌తో ఫైరింగ్ చేశారు. దీన్ని అమెరికా సైనికులు దగ్గరుండి చూశారు. తర్వాత భారత జవాన్లతో కలిసి M777పై ట్రైనింగ్ తీసుకున్నారు. రెండు దేశాల సైనికులు తమ అనుభవాలను ఒకరికొకరు పంచుకున్నారు. కలిసి పనిచేసే సామర్థ్యాన్ని ఈ విన్యాసాలతో మరింత పెంచుకోవాలని రెండు దేశాల సైన్యాలూ చూస్తున్నాయి.



