← Back to news

భూమి చుట్టూ చెత్తే చెత్త.. స్పేస్‌కు బిగ్ రిస్క్!

By Lokesh· 8h ago· Esa
భూమి చుట్టూ చెత్తే చెత్త.. స్పేస్‌కు బిగ్ రిస్క్!

భూమి చుట్టూ తిరిగే కక్ష్యలో వేల పాత శాటిలైట్లు, రాకెట్ ముక్కలు, చిన్న చిన్న శకలాలు ఉన్నాయి. 10 సెంటీమీటర్ల కంటే పెద్ద వ్యర్థాలు 50 వేలకుపైగా ఉన్నట్లు సమాచారం. 1 నుంచి 10 సెంటీమీటర్ల మధ్య ఉన్న ముక్కలు 12 లక్షలకు పైగా ఉండగా.. చిన్న పెయింట్ రేణువులు, ఇతర శకలాలు వందల కోట్లలో ఉన్నాయని అంచనా. ఇవి అంతరిక్షంలో చాలా వేగంగా తిరుగుతుండటంతో శాటిలైట్లు, ISSను ఢీకొడితే భారీ నష్టం జరిగే ప్రమాదం ఉంది. అందుకే ESA, ISRO లాంటి సంస్థలు స్పేస్ చెత్తను తొలగించే టెక్నాలజీపై పనిచేస్తున్నాయి.

More in International