రియాద్‌పై హౌతీల దాడి.. ఎయిర్‌పోర్ట్ దగ్గర పొగ

యెమెన్‌కు చెందిన హౌతీలు శనివారం సౌదీ అరేబియా రాజధాని రియాద్‌పై క్షిపణులు, డ్రోన్లతో దాడి చేసినట్లు ప్రకటించారు. రియాద్‌లోని కొన్ని కీలక ప్రాంతాలను లక్ష్యంగా చేసుకున్నట్లు చెప్పారు. కింగ్ ఖలీద్ ఎయిర్‌పోర్ట్ దగ్గర మంటలు, భారీ నల్లటి పొగ కనిపించాయి. రియాద్ వైపు వచ్చిన క్షిపణిని అడ్డుకున్నట్లు సౌదీ రక్షణ వ్యవస్థ తెలిపింది. ఈ దాడికి ముందు సౌదీ దళాలు యెమెన్ రాజధాని సనాపై దాడి చేశాయనీ, దానికి ప్రతిస్పందనగానే ఈ దాడి చేశామని హౌతీలు చెప్పారు.


