మాచినేనిపల్లిలో మెగా హెల్త్ క్యాంప్

నాగర్కర్నూల్ జిల్లా వంగూరు మండలం మాచినేనిపల్లి గ్రామంలో లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మెగా హెల్త్ క్యాంపును అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ ప్రారంభించారు. గ్రామీణ ప్రజలు ఉచిత వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఇలాంటి శిబిరాల ద్వారా జనరల్ మెడిసిన్, కంటి పరీక్షలు, బీపీ, షుగర్ పరీక్షలు నిర్వహించడంతో పాటు అవసరమైన వారికి ఉచితంగా మందులు అందించే అవకాశం ఉంటుందని తెలిపారు.




