LPG కస్టమర్లకు బిగ్ రిలీఫ్.. బుకింగ్‌లో మార్పు

గ్యాస్ సప్లై స్టేబుల్ అవడంతో LPG సిలిండర్ రీఫిల్ బుకింగ్‌పై కేంద్రం రెస్ట్రిక్షన్స్‌ను తగ్గించింది. గతంలో అర్బన్ ప్రాంతాల్లో 35 రోజులు, రూరల్ ఏరియాల్లో 45 రోజుల గ్యాప్ ఉండగా.. ఇప్పుడు 25 రోజులకే సిలిండర్ బుక్ చేసుకునే అవకాశం కల్పించింది. దీంతో గ్యాస్ గోడౌన్ల వద్ద క్యూ తగ్గి కస్టమర్లకు కాస్త రిలీఫ్ దొరికింది. అయితే కొత్త గ్యాస్ కనెక్షన్ల జారీ మాత్రం ఇంకా నిలిచిపోయింది. ఇతర ప్రాంతాల నుంచి వచ్చినవారు కొత్త కనెక్షన్లపై ఇబ్బందులు పడుతున్నారు.


