విమానంలో ఒక్కసారిగా కుదుపులు.. భయంతో ప్రయాణికుల కేకలు!
ఇస్తాంబుల్ నుంచి ట్యునీషియాకు వెళ్తున్న టర్కిష్ ఎయిర్‌లైన్ విమానం తీవ్ర టర్బులెన్స్‌కు గురైంది. ట్యునిస్-కార్తేజ్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులో ల్యాండ్ అయ్యేందుకు ట్రై చేస్తున్న టైంలో వాతావరణం ప్రతికూలంగా మారింది. మూడుసార్లు ల్యాండింగ్‌కు ట్రై చేసినా పరిస్థితులు అనుకూలించలేదు. విమానం ఒక్కసారిగా కిందకు పడిపోతున్నట్లు అనిపించడంతో ప్రయాణికులు భయంతో కేకలు వేశారు. విమానాన్ని ట్యునిస్‌కు దాదాపు 60 మైళ్ల దూరంలోని ఎన్‌ఫిధా-హమ్మామెట్‌కి మళ్లించారు. ఈ వీడియో వైరల్‌గా మారింది.



