మంగళగిరిలో మట్టి వినాయకుల పంపిణీ
AP: పర్యావరణ పరిరక్షణలో భాగంగా మట్టి వినాయక ప్రతిమలను పూజించాలని టీడీపీ నాయకులు సూచించారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం వద్ద వినాయక చవితిని పురస్కరించుకుని టీడీపీ ఆధ్వర్యంలో మట్టి వినాయక ప్రతిమల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు భక్తులకు మట్టి విగ్రహాలను అందజేశారు. రసాయనాలతో తయారు చేసిన విగ్రహాలను నిమజ్జనం చేయడం వల్ల నీటి వనరులు కలుషితమయ్యే అవకాశం ఉందని తెలిపారు.


