← Back to news

రోడ్లు అధ్వానం.. మొత్తం గుంతలమయం

By Rajiv Raju· 8h ago· Ntr
రోడ్లు అధ్వానం.. మొత్తం గుంతలమయం

ఎన్టీఆర్ జిల్లా రెడ్డిగూడెం మండలంలోని గ్రామీణ రహదారులు గుంతలమయమై ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తున్నాయి. దెబ్బతిన్న రోడ్లపై ప్రయాణించేందుకు వాహనదారులు, ప్రయాణికులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. పలుచోట్ల రహదారులు ప్రమాదకరంగా మారడంతో ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పాలకులు, అధికారులు స్పందించి రోడ్లకు మరమ్మతులు చేపట్టాలని కోరుతున్నారు. హామీలకే పరిమితం కాకుండా గ్రామీణ రహదారుల అభివృద్ధిపై ప్రజాప్రతినిధులు దృష్టి సారించాలని స్థానికులు కోరారు.

More in Local