← Back to news

కొడుకు మృతిపై న్యాయం కోసం నిరాహార దీక్ష

By Lokesh· 29 Sept 2026

IIT బాంబే బీటెక్ విద్యార్థి సాహిల్ వాకోడే మృతి కేసులో న్యాయం కోరుతూ ఆయన తల్లిదండ్రులు ముంబైలోని ఆజాద్ మైదాన్‌లో నిరాహారదీక్ష చేస్తున్నారు. సాహిల్‌పై కుల వివక్ష,మానసిక వేధింపులు జరిగాయని కుటుంబం తెలిపింది. ప్రొఫెసర్ సూర్యనారాయణ దూల్లాను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ ఆరోపణలపై SC/ST చట్టం, ఆత్మహత్యకు ప్రేరేపించిన కేసు నమోదైంది. ముంబై క్రైమ్ బ్రాంచ్ సీసీటీవీ, ఇతర ఆధారాలతో విచారణ కొనసాగిస్తోంది.

More in Crime