తాటిచెర్లలో చిరుతల దాడి.. 7 జింకలు బలి

AP : అనంతపురం జిల్లా తాటిచెర్లలో షాకింగ్ ఘటన జరిగింది. రైతు నరసింహారెడ్డి పొలానికి టమాటలను మేయడానికి వచ్చిన 7 జింకలు రెండు చిరుతల దాడిలో చనిపోయాయి. రైతు సమాచారంతో ఫారెస్ట్ ఆఫీసర్స్ వచ్చి పోస్ట్‌మార్టమ్ నిర్వహించారు. చిరుతలు తిరుగుతుండటంతో తాటిచెర్ల ఊరి జనాలు టెన్షన్‌లో ఉన్నారు. అధికారులు వెంటనే వాటిని పట్టుకుని తమను కాపాడాలని కోరుతున్నారు.


