← Back to news

ప్రభుత్వ ఐటీఐ కాలేజీ నిర్మించాలి.. BSP నిరసన!

By Ramesh· 20h ago· Thirumalayapalem, Tirumalayapalem, Khammam
ప్రభుత్వ ఐటీఐ కాలేజీ నిర్మించాలి.. BSP నిరసన!

ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలంలో 2024లో మంజూరైన ప్రభుత్వ ఐటీఐ కళాశాలకు స్థలం కేటాయించాలని BSP డిమాండ్ చేసింది. సోమవారం మండల కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం ఎదుట పార్టీ నియోజకవర్గ అధ్యక్షులు ఎన్నబోయిన రమేష్ ఆధ్వర్యంలో కళ్లకు గంతలు కట్టుకుని నిరసన తెలిపారు. సర్వే నంబర్ 254లోని 9 ఎకరాల ప్రభుత్వ స్థలంలో కళాశాల నిర్మించాలని కోరారు. విద్యార్థుల సౌకర్యార్థం త్వరగా నిర్మాణం చేపట్టాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో పాలేరు అసెంబ్లీ నాయకులు, BSP జిల్లా నాయకులు పాల్గొన్నారు.

ప్రభుత్వ ఐటీఐ కాలేజీ నిర్మించాలి.. BSP నిరసన!

More in Local