← Back to news

గణేష్ ఉత్సవాల్లో డీజేలు, లక్కీ డ్రాలకు అనుమతి లేదు..!

By Srikanth· 1d ago· Peddapalle (Ct), Peddapalli, Peddapalli
గణేష్ ఉత్సవాల్లో డీజేలు, లక్కీ డ్రాలకు అనుమతి లేదు..!

పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలంలో గణేష్ మండపాల నిర్వాహకులతో పోలీసులు మీటింగ్ పెట్టారు. సీఐ ప్రవీణ్ కుమార్, ఎస్సై శ్రీకాంత్ మాట్లాడారు. ఉత్సవాల్లో డీజేలు, లక్కీ డ్రాలకు అనుమతులు లేవని క్లారిటీ ఇచ్చారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో, ప్రశాంతంగా నిర్వహించాలని సూచించారు. మీటింగ్‌లో హెడ్ కానిస్టేబుల్ భూమయ్య, సిబ్బంది, మండపాల నిర్వాహకులు పాల్గొన్నారు.

More in Local