"వెల్ డన్ కాంగ్రెస్, వెల్ డన్ రాహుల్ గాంధీ".. KTR సెటైర్

TG: సైఫాబాద్ PSలో తన PRO మహేష్, PA మహేందర్ రెడ్డిపై కాంగ్రెస్ పార్టీ అనుచరులు <a href="https://www.theclearcutnews.com/n/pEocvo5">దాడి చేశారంటూ</a>.. BRS వర్కింగ్ ప్రెసిడెంట్ KTR సెటైరికల్ ట్వీట్ చేశారు. "లించింగ్ కేవలం చంపడంతో మొదలవదు.. పోలీస్ స్టేషన్‌లోనే ప్లాన్ చేసిన దాడులతో మొదలవుతుంది" అని అన్నారు. "రాష్ట్ర యంత్రాంగం గూండాయిజాన్ని ప్రోత్సహిస్తోంది. త్వరలో వీధుల్లోనే లించింగ్‌లు జరిగే ప్రమాదముంది" అని హెచ్చరించారు. ఇది ఏ పౌరుడికైనా జరగవచ్చనీ, తెలంగాణ అరాచకం వైపు వెళ్తోందనీ.. కాంగ్రెస్, రాహుల్ గాంధీని KTR విమర్శించారు.

