వలసల సమస్యపై ప్రత్యేక సమావేశం

TG: గద్వాల జిల్లా గట్టు మండలం ఇందువాసి గ్రామంలో వలసల కారణంగా విద్యార్థుల చదువుకు ఆటంకం కలుగుతోందని కిషోర బాలికల సంఘం ఆవేదన వ్యక్తం చేసింది. శనివారం నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో బడిబయట ఉన్న పిల్లలు, పాఠశాల మౌలికవసతులు, హాజరు శాతం, వలసల సమస్యలపై చర్చించారు. రాణి లక్ష్మీబాయి టీమ్ లీడర్ మమత మాట్లాడుతూ.. గ్రామంలోని 120 కుటుంబాలు ఏటా నవంబర్ నుంచి జూన్ వరకు వలస వెళ్తుండగా, వారితో 50 మంది విద్యార్థులు వెళ్లి చదువుకు దూరమవుతున్నారని తెలిపారు. గ్రామంలో తక్షణమే హాస్టల్ ఏర్పాటు చేయాలని కలెక్టర్‌ను కోరారు.



