STU పోస్టర్ ఆవిష్కరణ

సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలం బేగంపేట హైస్కూల్‌లో STU 80వ ఆవిర్భావ దినోత్సవ వేడుకల పోస్టర్‌ను ఆవిష్కరించారు. టీచర్స్ ట్రైనింగ్ మీటింగ్‌లో HM భరత్‌రెడ్డి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఎస్టీయూ 80 ఏళ్ల సుదీర్ఘ ప్రస్థానాన్ని పురస్కరించుకుని ఆదివారం నిర్వహించే ఈ వేడుకలకు టీచర్లందరూ పెద్ద సంఖ్యలో వచ్చి సక్సెస్ చేయాలని నాయకులు పిలుపునిచ్చారు.


