← Back to news

పొంగులేటిని వెంటనే బర్తరఫ్ చేయాలి: హరీశ్‌రావు

By DK· 20 Aug 2026· హైదరాబాద్
పొంగులేటిని వెంటనే బర్తరఫ్ చేయాలి: హరీశ్‌రావు

TG: 22ఏ భూముల వ్యవహారంపై మాజీ మంత్రి హరీశ్‌రావు తీవ్ర ఆరోపణలు చేశారు. సెటిల్మెంట్లు, కమీషన్ల కోసమే ప్రైవేట్ భూములను 22ఏ నిషేధిత జాబితాలో చేర్చారని ఆరోపించారు. బాధితులకు అండగా హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో BRS‌ లీగల్‌ సెల్‌ ఏర్పాటు చేసి, 10మంది న్యాయవాదులతో ఉచిత న్యాయసాయం అందిస్తామని ప్రకటించారు. తెలంగాణ భవన్‌లో 22ఏ నిషేధిత భూములతో నష్టపోయిన బాధితులతో ఆయన మాట్లాడారు. ఆంక్షలతో లక్షలాది మంది ఇబ్బందులు పడుతున్నారని, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డిని క్యాబినెట్‌ నుంచి తొలగించాలని డిమాండ్‌ చేశారు.

More in TG