ఆ AI డేటా సెంటర్ ఎందుకు రద్దయ్యింది?

అమెరికా.. నార్త్ కరోలినా.. ఎడ్జ్‌కాంబ్ కౌంటీలో ఎనర్జీ స్టోరేజ్ సొల్యూషన్స్ ప్రపోజ్ చేసిన 19 బిలియన్ డాలర్ల AI డేటా సెంటర్ ప్రాజెక్ట్.. జులైలో నిర్మాణం ప్రారంభం కాకముందే రద్దైంది. నీటి కొరత, కరెంటు వాడకం, లైఫ్ క్వాలిటీపై స్థానికులు గట్టిగా ప్రశ్నించడంతో డెవలపర్ వెనక్కి తగ్గారు. కౌంటీ అధికారులు వేరే ప్రాంతాల్లో డేటా సెంటర్లను ఏర్పాటు చేయించే అంశాన్ని పరిశీలిస్తున్నారు. ఐతే.. మిగతా ప్రాంతాల్లో కూడా వ్యతిరేకత వస్తోంది. అక్కడి ప్రజలు సమైక్యంగా పోరాడటంతో డేటా సెంటర్‌కి బ్రేక్ పడింది.



