చెన్నకేశవ నగర్లో కార్డన్ సెర్చ్

గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలం చెన్నకేశవనగర్లో నార్త్ సబ్ డివిజన్ డీఎస్పీ కె.వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ఈ తనిఖీల్లో అనుమానాస్పదంగా ఉన్న సుమారు 60 వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. సరైన పత్రాలు చూపించిన వాహనాలను యజమానులకు తిరిగి అప్పగించారు. రానున్న ఎన్నికల నేపథ్యంలో ప్రజలకు చట్టాలపై అవగాహన కల్పించారు. సైబర్ నేరాలు, డిజిటల్ అరెస్ట్ మోసాలపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు.



