కస్టమర్‌గా వచ్చింది.. ఉంగరాల బాక్స్ ఎత్తుకెళ్లింది!
రాజస్థాన్‌లోని జైపూర్‌లో ఉన్న భవానీ జ్యువెలరీ షాప్‌కి ఒక యువతి కస్టమర్‌లా వచ్చింది. రింగ్స్ చూపించమని అడగడంతో షాప్‌కీపర్ రింగ్స్ ఉన్న బాక్స్‌ను ఆమె ముందు ఉంచాడు. అతను వేరే కస్టమర్‌తో మాట్లాడుతుండగా.. ఆ యువతి ఒక్కసారిగా రింగ్స్ బాక్స్ పట్టుకుని అక్కడి నుంచి పరిగెత్తింది. అది చూసిన షాప్‌కీపర్ వెంటపడి 500 మీటర్లు పరిగెత్తి ఆమెను పట్టుకున్నాడు. ఆ బాక్స్‌లో రూ.20 లక్షల వర్త్ ఉన్న 25 ఉంగరాలు ఉన్నాయని షాప్ ఓనర్ చెప్పారు. కేసు ఫైల్ చేసిన పోలీసులు ఆ యువతిని కస్టడీకి తీసుకున్నారు.


