← Back to news

స్పామ్ కాల్స్‌కు TRAI చెక్.!

By Anusha· 2h ago
స్పామ్ కాల్స్‌కు TRAI చెక్.!

స్పామ్ కాల్స్‌కు TRAI కొత్త రూల్స్ తెచ్చింది. యూజర్లు కంప్లైంట్ చెయ్యకపోయినా, AI ద్వారా స్పామ్‌గా గుర్తించిన నంబర్లపై టెలికం కంపెనీలు చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. ఒకే వ్యక్తికి చెందిన 5 లేదా అంతకంటే ఎక్కువ నంబర్లు 10 రోజుల్లో స్పామ్‌గా తేలితే కనెక్షన్లపై చర్యలు తప్పవు. తొలిసారి 15 రోజులు అవుట్‌గోయింగ్ కాల్స్ బ్లాక్ చేస్తారు. మళ్లీ తప్పు చేస్తే ఏడాది పాటు అన్ని కనెక్షన్లు కట్ చేసి, బ్లాక్‌లిస్ట్‌లో పెడతారు. ప్రమోషనల్ కాల్స్ ఆపాలంటే 1909కు BLOCK PROMO అని SMS చెయ్యొచ్చు.

More in National