← Back to news

"వైజాగ్ రోడ్లు.. బాబోయ్!"

By Krishna· 20h ago· Instagram

AP: ఆంధ్రప్రదేశ్‌లో స్టీల్ సిటీగా పేరున్న విశాఖపట్నంలో రోడ్లు దారుణంగా ఉన్నాయని నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. గోతులు, గుంతలతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారనీ.. కొన్ని ప్రాంతాల్లో మట్టిని పోసి.. టెంపరరీ సొల్యూషన్ చూడటం వల్ల.. ఆ ప్రాంతాల్లో రోడ్లపై వాహనాలు మట్టిలో ఇరుక్కుపోతున్నాయని అంటున్నారు. దువ్వాడ నుంచి మధురవాడ వరకూ ఇదే పరిస్థితి ఉందనీ, రీసెంట్ సైక్లోన్ వల్ల సమస్యలు మరింత పెరిగాయని అంటున్నారు. GVMC అధికారులు వెంటనే రోడ్లను రిపేర్ చెయ్యాలని కోరుతున్నారు.

More in AP