మహిళల భద్రతపై సుప్రీం కీలక ఆదేశాలు

ఢిల్లీలో మహిళలు, బాలికలపై లైంగిక నేరాలను అడ్డుకునేందుకు సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. 24 గంటలు పనిచేసే మానిటరింగ్ సెల్స్ ఏర్పాటు చేయాలని ఢిల్లీ పోలీసులను ఆదేశించింది. మహిళలు ఎక్కువగా వెళ్లే ప్రాంతాలు, పార్కులు, బస్‌స్టాప్‌లు, మెట్రో, రైల్వే స్టేషన్లపై పర్యవేక్షణ పెంచాలని సూచించింది. సీసీటీవీలు, పోలీస్ పెట్రోలింగ్ పెంచాలని సూచించింది. నేరం జరిగిన తర్వాత చర్యలు తీసుకోవడం కంటే.. ముందే అడ్డుకునేలా పోలీసులు పనిచేయాలని కోర్టు స్పష్టం చేసింది.



