← Back to news

జాబ్ కోసం చూస్తున్నారా? జరా జాగ్రత్త!

By Lokesh· 2h ago· Ndtv
జాబ్ కోసం చూస్తున్నారా? జరా జాగ్రత్త!

ఢిల్లీలోని రంజిత్ నగర్‌లో ఉద్యోగాలు ఇప్పిస్తామని నిరుద్యోగులను మోసం చేస్తున్న రెండు ఫేక్ కాల్ సెంటర్లను పోలీసులు పట్టుకున్నారు. షాదీపూర్ మెట్రో స్టేషన్ దగ్గరలోని బిల్డింగ్లో ఇవి జరుగుతున్నట్లు గుర్తించారు. జాబ్ ఇప్పిస్తామని చెప్పి ఫీజ్ పేరుతో డబ్బులు వసూలు చేస్తున్నారని పోలీసులు చెప్పారు. మొత్తం 11 మందిని అదుపులోకి తీసుకున్నారు. 13 కంప్యూటర్లు, 5 ఫోన్లు, ఉద్యోగం కోసం చూస్తున్న వారి సమాచారం, ఇతర ఆధారాలను స్వాధీనం చేసుకున్నారు.

More in National