పాత స్మార్ట్ ఫోన్లు.. కిలో 2.5 లక్షల రూపాయలా?

ఢిల్లీ స్క్రాప్ మార్కెట్లలో పాత స్మార్ట్‌ఫోన్లకు డిమాండ్ ఉంది. ఫోన్లను విడదీసి డిస్‌ప్లే, మదర్‌బోర్డ్, బ్యాటరీ, కెమెరాలను వేరుగా అమ్ముతారు. ఈ పాత స్మార్ట్ ఫోన్లు కిలోకు 2.5 లక్షల రూపాయలు పలుకుతాయని ఓ వార్త వైరల్ అవుతోంది. అందులో నిజం లేదు. మిక్స్‌డ్ స్క్రాప్ కెమెరా మాడ్యూల్స్ ఒక పీస్‌కు వంద రూపాయల నుంచి నూట యాభై దాకా ఇస్తారు. ఆండ్రాయిడ్/కీప్యాడ్ ఫోన్ కెమెరా స్క్రాప్ కిలోకు 15 వేల నుంచి 25 వేల రూపాయల వరకూ ఉంటుంది. కాబట్టి ఇది FAKE NEWS.



