కేరళంలో ఈసీ అధికారుల నియామకాలపై బీజేపీ విమర్శలు

కేరళంలో ECలో ఉన్నత పదవుల్లో పనిచేసిన అధికారులు, పదవీ విరమణ లేదా పదవి నుంచి తప్పుకున్న వెంటనే రాజకీయ పార్టీల్లోకి రావడంపై బీజేపీ అభ్యంతరం వ్యక్తం చేసింది. దీనిపై తన ఎక్స్ అకౌంట్లో పోస్ట్ చేసింది. గతంలో కేరళ CEOగా ఉన్న వ్యవహరించిన టికా రామ్ మీనా, ఆ పదవి నుంచి తప్పుకున్న ఏడాదికే కాంగ్రెస్ పార్టీకి చెందిన రాజస్థాన్ ఎన్నికల మ్యానిఫెస్టో కమిటీలోకి ప్రవేశించారని తెలిపింది. మరో CEO ప్రస్తుత సీఎం వి.డి.సతీశన్కు సెక్రటరీగా అపాయింట్ అయ్యారని చెప్పారు.


