ఇస్లాం మతంలోకి మారితే బీసీ రిజర్వేషన్ రాదు: సుప్రీం

ఇస్లాం మతంలోకి మారిన వ్యక్తులు వెనుకబడిన తరగతుల(BC) రిజర్వేషన్లకు అర్హులు కాదంటూ మద్రాస్ హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు సమర్థించింది. తమిళనాడు ప్రభుత్వం వేసిన అప్పీల్‌ను సుప్రీంకోర్టు కొట్టేసింది. హిందూ వ్యవస్థలోని వ్యక్తి సామాజిక వెనుకబాటుతనాన్ని, మతం మారిన తర్వాత మరో వ్యవస్థలోకి బదిలీ చేయడానికి వీలుపడదని క్లారిటీ ఇచ్చింది. మతం మారినంత మాత్రాన రాజ్యాంగంలోని ఆర్టికల్ 16(4) కింద కల్పించే రిజర్వేషన్ ప్రయోజనాలను పొందలేరని చెప్పింది.


