BRS 3.0లో తప్పు చేసినోళ్లను వదలం : RS ప్రవీణ్ కుమార్

తెలంగాణ భవన్‌లో జరిగిన మీటింగ్‌లో BRS జనరల్ సెక్రటరీ RS ప్రవీణ్ కుమార్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. రాబోయే రోజుల్లో KCR నాయకత్వంలో 'BRS 3.0' ప్రభుత్వం చాలా డిఫరెంట్‌గా ఉంటుందని అన్నారు. మంచి చేసిన వాళ్లను గుండెల్లో పెట్టి కాపాడుకుంటాం కానీ, రేవంత్ రెడ్డి మాటలు విని అక్రమ కేసులు పెట్టి, ప్రజలను వేధించిన వాళ్లపై చట్టపరంగా కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. అక్రమాలకు పాల్పడిన వారిని విచారించడానికి ప్రత్యేకంగా ట్రిబ్యునల్ కూడా ఏర్పాటు చేస్తామని తెలిపారు.



