AI డేటా సెంటర్, రైతుల ఆందోళన!

విశాఖపట్నం.. తార్లువాడలో గూగుల్-అదానీ కలిసి నిర్మిస్తున్న భారీ AI డేటా సెంటర్ కోసం సుమారు 520 కుటుంబాల నుంచి భూములు తీసుకున్నారని రైతులు అంటున్నారు. తమకు పరిహారం అందినా, కొందరికి హామీ ఇచ్చినట్లు కొత్త భూమి, ఉద్యోగాలు ఇంకా రాలేదని అంటున్నారు. 100 ఎకరాలకు పైగా చెట్లను తొలగించడం, 2.51GW డేటా సెంటర్ కోసం అధిక కరెంటు వాడకం, వేడి, నీటి సమస్యలపైనా ఆందోళనలు ఉన్నాయి. దీనిపై యాక్టివిస్టులు కోర్టుకు వెళ్లారు. ప్రభుత్వం మాత్రం అంతా బాగానే ఉందని అంటోంది.



