2022లో మా ఓట్లు డిలీట్ చేశారన్న అఖిలేష్

2017లో ఎన్నికల కమిషన్‌ను నమ్మామని.. కానీ 2022 UP అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ ఓట్లను కావాలనే డిలీట్ చేశారని సమాజ్‌వాదీ పార్టీ (SP) చీఫ్ అఖిలేష్ యాదవ్ ఆరోపించారు. ఈ విషయంపై అప్పట్లోనే ECకి అఫిడవిట్ల ద్వారా ఇన్ఫర్మేషన్ ఇచ్చినా.. ఒక్క అధికారిపైనా చర్యలు తీసుకోలేదన్నారు. 2019లో ఓటు వేసిన కొందరిని 2022లో రూల్స్ పాటించకుండా, ఓటు వేయకుండా అడ్డుకున్నారని ఆయన అన్నారు. ఎన్నికల అధికారులు కావాలనే SP ఓట్లను తొలగించారని అఖిలేష్ ఆరోపించారు.

